Joint staff council : PRC నివేదిక... ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్


 అక్టోబర్ 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో PRC నివేదికను వారం రోజులలో ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున గౌరవ CS గారిని కలిసి PRC  రిపోర్ట్ ను ఉద్యోగ సంఘాలకు అంద చేయవలసిందిగా కోరాము. Joint staff council సమావేశం తర్వాత ఎక్కువ రోజులు సెలవు దినాలు కావడంతో సమావేశంలో చర్చించిన అంశాలను CM గారి దృష్టికి తీసుకెళ్లలేదు. వచ్చే బుధ లేదా గురువారాల్లో  CM గారితో చర్చించి ఈ వారంలో PRC నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని CS గారు తెలిపారు. 

రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని సంబంధిత పరీక్షలు పాస్ అయిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొఫెషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్ 29వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల అమలులో జాప్యం జరుగుతున్నందున ఈ ఆదేశాలు వెంటనే అమలు అయ్యేలాగా చొరవ తీసుకోవాలని CS గారిని కోరాము. ఇంకా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సి ఎస్  గారి దృష్టికి తీసుకెళ్లగా సి ఎస్ గారు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు వర్కింగ్ ప్రెసిడెంట్ నిఖిల్ కృష్ణ, బి.ఆర్ కిషోర్ లు పాల్గొన్నారు. 

కే వెంకట రామి రెడ్డి  

చైర్మన్ 

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్

Comments